
ఆదివాసి గిరిజనులు ఏకం చేయడంతో పాటు వారి హక్కుల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుడు చింత కృష్ణను ములుగు నియోజకవర్గ తుడుం దెబ్బ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దించారు. చింతా కృష్ణను హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం భీ- ఫాం తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నన్ను ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.