
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ర్యాలీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలం లోని పసరలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ప్రధానంగా దేశంలో నిత్యవసర వస్తువులధరలు పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు ప్రధానంగా ఉపాధి హామీ నిధులు తగ్గించి పేద ప్రజ లు చేసే పనులు పనులు కోల్పోయారని రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న ఉద్యోగాలు తొలగించారని సంస్కరణలు వేగంగా తీసుకొస్తూ ప్రజా సంపదతో నిర్మించిన పబ్లిక్ రంగ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ఆధా నీ ,అంబానికి దోచిపెడుతుందని ఈ నాలుగున్నర ఏళ్లలో 11 లక్షల కోట్లు రాయితీలు కార్పొరేట్ శక్తులకు ఇచ్చారని పేర్కొన్నారు దేశాభివృద్ధి అంటే కార్పొరేట్ అభివృద్ధి అని అనే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలందరూ దీనిని వ్యతిరేకించాలని అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని గృహలక్ష్మి పథకం అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని తునికాకు బోనసు వాస్తవంగా తురికాకు కోసిన వారికి కాకుండా కలేదారు బంధువుల ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయని పసరలో కూడా తునికాకు బోనసు అందరికీ రాలేదని అర్హులైన అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్ మండల కమిటీ సభ్యులు అంబాల మురళి సిపిఎం సీనియర్ నాయకులు అంబాల పోశాలు సంజీవ బుజ్జి బాబు యానాల ధర్మారెడ్డి పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.