నవతెలంగాణ -నవీపేట్: మునుముందు మరింత ప్రజాసేవ చేస్తానని తూము శివమ్మ ట్రస్ట్ చైర్మన్ శరత్ రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మారం(యం) గ్రామంలో నిరుపేదలకు బియ్యం సంచి, నిత్యవసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పేద ప్రజలకు పలు విధాలుగా సేవ చేసేందుకు ముందు వరుసలో ఉంటానని అన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్, పిట్ల సత్యం, మహేందర్ రెడ్డి, రాజయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.