– వైభవంగా జరిగిన శ్రీ స్వయంభూ పార్వతి సమేత సోమేశ్వర స్వామి కళ్యాణం
– అలరిస్తున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ స్వయంభూ పార్వతి సమేత సోమేశ్వర స్వామి జాతర సందర్బంగా తెలుగురాష్ట్రల స్థాయి పురుషులు కబడ్డీ పోటీలు శివసాయి యూత్ ఆధ్వర్యంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమాయ్యాయి. ఈ పోటీలనుజిల్లా కాంగ్రేస్ సీనియర్ నాయకులు శిరసన గండ్ల లక్ష్మి నరసింహమ్మా రావు,ప్రముఖ కాంట్రాక్టర్ శిరసనగండ్ల ప్రదీప్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండా, క్రీడా పోటీలకు సంబందించిన జెండాలను ఆవిష్కరణ చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మ్యాట్ పై డే అండ్ నైట్ మూడురోజుల పాటు జరిగే పురుషుల కబడ్డి పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో టాప్ 10 లో వున్న 15 టీములను ఆహ్వానిస్తున్నారు. ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను తిలకించుటకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రలే నుండి అభిమానులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో రానున్నారు. దీనికి గాను నిర్వాహకులకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈసందర్బంగా సిఐ మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రధమ బహుమతి 50వేలు, రెండవ బహుమతి, 40వేలు, మూడవ బహుమతి 30వేలు, నాల్గవ బహుమతి 25 వేలు, ఐదవ బహుమతి 20వేలు, ఆరవ బహుమతి 15వేలు, ఏడవబహుమతి 12వేలు, ఎనిమిదవ బహుమతి 10 వేలు ప్రయిజ్ మని తో బాటు శీల్దులు బహుకరించిండం ఎంతో శుభసూచకమని అన్నారు.నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున క్రీడాపోటీలు నిర్వహిస్తున్న శివసాయి యూత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీఈటీల సహకారం తో తెలుగు రాష్ట్రల విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో గుంటుక పెద్ద సైదిరెడ్డి, దుగ్యాల శంకర్,పల్లెబోయిన సత్యనారాయణ,ఇరుమాది శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ ఛైర్మెన్ సాంభయ్య, దారెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి,తదితరులు వున్నారు.రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కర్తయ్య, కాంగ్రేస్ నాయకులు గుంటుక సైదిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.