నవతెలంగాణ-ఆసిఫాబాద్
భారీ వర్షంతో పిడుగులు పడిన ఘటనలో కుమురంభీం-ఆసిపాబాద్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఆసిఫాబాద్ మండలం హీరాపూర్ గ్రామంలో బోయిరే విట్టు పొలంలో యూరియా వేసేందుకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. యూరియా వేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో భార్య బోయిరే మీనా అక్కడికక్కడే చనిపోయింది. ఆమె తల్లి లక్ష్మి గాయాలతో బయటపడింది. ఆమె జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిర్రకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టచెల్మ గ్రామంలో పొలం దున్నుతున్న దేవ్‌రావు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరి మృతదేహాలను ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడింది. అడ, వట్టి వాగు ప్రాజెక్టుకు సంబంధించిన రెండేసి గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.