వడదెబ్బతో ఇద్దరు మృతి

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
నాలుగు రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, పరిసర గ్రామాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 నుంచి 46 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో సోమవారం వడదెబ్బకు గురై పట్టణంలోని దీక్షిత్‌నగర్‌కాలనీలో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ(60), దద్దనాల చెరువు కాలనీలో నివాసం ఉంటున్న పటాన్‌ ముస్తక్‌ఖాన్‌(74) మృతిచెందారు. ముస్తక్‌ఖాన్‌ రోజువారి కూలీ పనులకు వెళ్తుంటాడు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆర్‌ఎంపీపీఎంపీల అసిసోయేషన్‌ నాయకులు ఎస్‌కె.మన్సూర్‌అలీ ప్రభుత్వాన్ని కోరారు.