హిందీ విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ మృతి పట్ల రెండు నిమిషాల మౌనం..

నవతెలంగాణ డిచ్ పల్లి
ఉస్మానియా యూనివర్సిటీ హిందీ విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ సింగ్ ఇటీవల మృతి చెందడం పట్ల హిందీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం యూనివర్సిటీలో రెండు నిమిషాల మౌనం పాటించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ మోహన్ సింగ్ తెలంగాణ యూనివర్సిటీ కి అనేక హిందీ పుస్తకాలు వితరణ చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ హిందీ విభాగం అధ్యక్షులు డాక్టర్ జమీల్ అహ్మద్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ పార్వతి చైర్మన్ ,బిఓఎస్, డాక్టర్ తాహెర్ ,డాక్టర్ అశోక్, అధ్యాపకులు విద్యార్థులు వాసు, నవనీత్ తదితరులు పాల్గొన్నారు.