రతన్‌టాటాకు ఉద్యోగ రత్న అవార్డ్‌

ముంబయి : దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించింది. శనివారం రతన్‌ టాటా నివాసంలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొని.. రతన్‌ టాటాకు అవార్డ్‌ను ప్రదానం చేశారు. రతన్‌ టాటా, టాటా గ్రూప్స్‌ దేశానికి ఎనలేని సేవలందించాయని షిండే పేర్కొన్నారు.