ఏకగ్రీవ తీర్మానాలు ప్రజల స్వచ్ఛంద నిర్ణయం

– వేముల ప్రశాంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ నాయకత్వం కావాలంటూ కామారెడ్డి నియోజకవర్గంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాలనేవి ప్రజల స్వచ్ఛంద నిర్ణయాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరు సార్లు ఓడిపోయిన షబ్బీర్‌ అలీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే షబ్బీర్‌ అలీ ఓటమిని అంగీకరించారని ఎద్దేవా చేశారు.