తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి

నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు 20వేల ఆర్థిక సహకారం అందించాలని ఎమ్మార్వో ధన్వల్ కు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండలంలో కురిసిన భారీ వర్షాలకు మాటు కాలువ కట్ట తెగిపోయి లింగాపూర్, నిజాంపూర్ రైతులు తీవ్రంగా నష్టపోయారని మండలంలో నష్టపోయిన రైతులకు 20వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ సింగ్, సుదర్శన్, రాజశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.