రాకేష్ రెడ్డి ఫౌండేషన్ అధ్వర్యంలో ఆర్థిక సహాయం

నవతెలంగాణ – మాక్లూర్: మండలం ధర్మోరా, బొంకన్ పల్లి, గుంజిలి, చీక్లి గ్రామాలలో బాధితులకు రాకేష్ రెడ్డి పౌండేషన్ అధ్వర్యంలో ఆర్థిక సహాయం బుదవారం చేశారు. అర్ అర్ పౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి చేతుల మీదుగా బాధితులకు సహాయం అందజేశారు. దర్మోరా గ్రామంలో సాయనోల్ల శ్రీనివాస్ (32) సంవత్సరాలు ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో రెండు రోజుల తర్వాత చనిపోవడం జరిగింది వీరి కుటుంబానికి రూ. 10 వేల రూపాయలు, బొంకన్ పల్లి గ్రామానికి చెందిన నిజాoపూర్ సాయిలు ఇటీవలే ప్రమాదవషాత్తు మరణించడం జరిగింది వారి కుటుంబానికి రూ. 10 వేల రూపాయలు, గుంజిలి గ్రామానికి చెందిన దూడ సుజాత ఆర్థిక పరిస్థితి బాగా లేనందున వారి కుటుంబానికి ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా రూ. 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సురేష్, భూమేష్ తదితరులు పాల్గన్నారు.