ఐఎంఎ నిజామాబాద్ అధ్వర్యంలో నేడే పల్లెకు పోదాం పద కార్యక్రమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని సాంపల్లి గ్రామంలో ఆదివారం ఐఎంఎ నిజామాబాద్ అధ్వర్యంలో పల్లెకు పోదాం పద కార్యక్రమం లో భాగంగా మెగా రూరల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మోహన్ రెడ్డి శనివారం నాడోక ప్రకటనలో తెలిపారు.సాంపల్లి గ్రామంలో మండలం ఆదివారం ఉదయం 8:30 కు ప్రారంభమవుతుందని ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ప్రముఖులు డాక్టర్ బియన్ రావు  ఐయంఏ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, దర్పల్లి జడ్పీ టీసి సభ్యులు బాజిరెడ్డి జగన్ మోహన్, జెడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, ఎంపీపీ గద్దె భూమన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటియస్ శ్రీనివాస్, డాక్టర్ నీలి రామచందర్ డాక్టర్ జి.టి.ఆర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తోపాటు తదితరులు పాల్గొనున్నారు.