సుస్థిర వ్యవసాయం, వార్మింగ్ కంపోస్ట్ పై అవగాహన

నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని అంతంపల్లి గ్రామంలో సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయం, వార్మింగ్ కంపోస్ట్ తయారి పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ రిసోర్స్ పర్సన్ సిద్ధ రాములు, ఫీల్డ్ వర్కర్ భూపతి మాట్లాడుతూ పాలి హౌస్ వాడే విధానం, ఉపయోగాల గురించి, ఖరీదు సబ్సిడీ గురించి రైతులకు వివరించారు. వ్యవసాయం అభివృద్ధిలో భాగంగా ఇచ్చే పని సబ్సిడీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుమోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్నేహ, అంగన్వాడీ టీచర్ కల్పన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.