– మంత్రి సబితకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మల్టీజోన్-2లోని ఉపాధ్యాయులకు కోర్టు అనుమతితో పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్‌ఎం) పదోన్నతులు జరిగిన మల్టీజోన్-1, మల్టీజోన్-2 ప్రభుత్వ యాజమాన్యంలోని మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. టెట్ ఉత్తీర్ణత అయిన వారికే పదోన్నతి అనే నిబంధనను మార్చి కోర్టు అనుమతితో సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని సూచించారు. పండితులు, పీఈటీలపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అందరికీ న్యాయం చేసేలా పదోన్నతులు కల్పించాలని కోరారు. 317 జీవో ద్వారా సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు కేటాయించిన వారిని తిరిగి వారి సొంత జిల్లాలకు పంపేటపుడు సరిపడా ఖాళీల్లేకుంటే సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలిపారు. ఏజెన్సీలో నియామకమైన వారిని మైదాన ప్రాంతానికి పంపడం చట్టవిరుద్ధమమంటూ తన దృష్టికి కొందరు ఉపాధ్యాయులు తెచ్చారనీ, దీనిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వారికి మినిమం టైంస్కేల్ ఇవ్వాలని కోరారు.
ంలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.