– భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండలంలోని ఎడ్లపల్లి అటవీప్రాంతంలో ఉన్న చిన్నతరహా ప్రాజెక్టుయిన బొగ్గులవాగు ప్రాజెక్టు డి1,డి2 కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్‌మిశ్రా ఇరిగేషన్ అధి కారులను ఆదేశించారు. ఇటీవల స్థానిక ఎంపీపీ చింతలపల్లి మల్హర్‌రావు,సర్పంచ్ జనగామ స్వరూప బాపు బొగ్గులవాగు కాల్వలు అస్తవ్యస్తంగా ఉండటం తో పొలాలకు నీరు సరిగా పోకుండా వృథాగా పోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ మంగళవారం బొగ్గులవాగు ప్రాజెక్టు కాల్వలను ఎంపీపీతో కలిసి పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిన మట్టి తొలగిం చాలని, ఇందుకు నిధులు త్వరలోనే మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వగా ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జంగిడిపల్లి లోని మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అవ రోధించాలన్నారు. అనంతరం తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్షించారు.సిజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రోజువారీ ఓపీ, ల్యాబ్, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ శ్రీనివాస్, జెడ్పీటీసీ ఐత కోమల రాజిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఇరిగేషన్ అధికారులు, మండల వైద్యాధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.