స్పౌజ్ బదిలీలు చేపట్టండి..

– ఎమ్మెల్సీ కవిత ని వేడుకున్న మహిళా ఉపాధ్యాయినీలు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ లోని క్యాంపు ఆఫీసులో స్పౌజ్ ఫోరం సభ్యులు ఎమ్మెల్సీ కవిత ని కలిసి (ఎస్ జి టి, పి ఈ టి)SGT, PET, బాషా పండితులు మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్, మిస్సింగ్ స్పౌజ్ బదిలీలను చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. కవిత గారు తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి తో ఫోన్లో మాట్లాడి సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరారు. మొదటి నుండి తమకు అండగా ఉండి ధైర్యం చెప్పి స్పౌజ్ సమస్యను పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినందుకు కవిత కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత జనవరిలో ప్రభుత్వం కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా మిగిలిన 1500 ఎస్ జి టి, భాషపండితులు, పీఈటి ల స్పౌజ్ బదిలీల విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా జరిపించాలని ఎమ్మెల్సీ కవిత ని మహిళా ఉపాధ్యాయినీలు వేడుకున్నారు. ఇందులో మెజారిటీ బాధితులు మహిళ ఉపాధ్యాయినీలె ఉన్నారనీ వారు ప్రతిరోజు కుటుంబాన్ని వదిలిపెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తీవ్ర శారీరక, మానసిక ఆందోళనకు లోనవుతున్నారని పేర్కోన్నారు. ఈ సమస్యకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, మనోజ, వందన , గౌతమి, పర్వీనా, నరేష్,రాజు, స్పామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.