కేసీఆర్‌ కృషితోనే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

– మంత్రి శ్రీనివాసగౌడ్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ కృషితోనే రామప్ప గుడికి యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు లభించిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోనారాయణపేట జిల్లా ముడుమాల్‌ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంటేషన్‌, పరిరక్షణకు, సాంకేతికమైన సేవలు అందించేందుకు తెలంగాణ హెరిటేజ్‌ శాఖ, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ల మధ్య జరిగిన పరస్పర ఒప్పంద పత్రాలను మంత్రి అందజేశారు. తెలంగాణ హెరిటేజ్‌ శాఖ, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమి ట్రస్ట్‌ చైర్మెన్‌ వేదకుమార్‌, తెలంగాణ హెరిటేజ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాములు నాయక్‌, హెరిటేజ్‌ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్‌, ప్రొఫెసర్‌ కేపీరావు తదితరుల పాల్గొన్నారు.