ఏకరూప దుస్తుల బకాయిలు చెల్లించాలి : డీటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గతేడాది సరఫరా చేసిన ఏకరూప దుస్తుల బకాయిలను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఈ ఏడాది దుస్తులు కుట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. ఒక డ్రెస్‌ కుట్టుకూలి కింద కేవలం రూ. 50 మాత్రమే చెల్లిస్తున్నారనీ, మార్కెట్‌ రేట్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువని చెప్పారు. కుట్టుకూలిని రూ.300కి పెంచాలని డిమాండ్‌ చేశారు. 6,7 తరగతి విద్యార్థులకు నిక్కర్‌ కాకుండా ప్యాంటునే కుట్టించాలని కోరారు.