
నవతెలంగాణ- కంటేశ్వర్
ఇటీవల యూనియన్ బ్యాంకులు పదవి విరమణ పొందిన కోటగిరి విజయ కు మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై విజయ యూనియన్ బ్యాంక్ లో చేసిన కృషిని కొనియాడారు. మరియు విజయ నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తూ సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యులైనందుకు వారిని అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు నాంపల్లి, తెడ్డు గంగారం మాదిగ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు సుధాకర్,మాదిగ,రిటైర్డ్ ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు గుడ్ల రాములు, రమేష్, మాదిగ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయకులు గణేష్ మారుతి మరియు రిటైర్డ్ ఉద్యోగులు మహిళ నాయకురాలు పోసాని తదితరులు పాల్గొన్నారు.