
తెలంగాణ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం కమిటీ ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం కమిటీ ను ఎన్నుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్షుడుగా శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా నరేష్, ప్రధాన కార్యదర్శిగా సంపత్, కార్యదర్శిగా యాదగిరి, సభ్యులుగా మణికంఠ, శ్రీకాంత్, నరేష్ ,చంద్రశేఖర్, నారాయణలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ లాంటి బహుజన మహాత్ముల అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక న్యాయం, సామాజిక స్వతంత్రం కోసం నిరంతరం పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.