కాకినాడలో జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో  యూనివర్సిటీ పురుషుల  జట్టు..

నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ కబడ్డీ పురుషుల జట్టు గురువారం నుండి  12  వరకు అంద్రప్రదేశ్ రాష్ట్రం లోని  కాకినాడలో జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనడానికి యూనివర్సిటీ కబడ్డీ జట్టు కాకినాడ కు బయల్దేరిందని యూనివర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్. జి.బాలకిషన్ తెలిపారు. ఈ వర్సిటీ కబడ్డీ జట్టు కు మేనేజర్ గా డా. బి. ఆర్. నేత కోచ్ గా ఎం. ప్రశాంత్ లను నియమించినట్లు డైరెక్టర్ తెలిపారు. క్రీడాకారుల ను అందరిని అభినందిస్తూ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబరిచి వర్సిటీ కీ, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యా తులను తీసుకు రావాలని పేర్కొన్నారు.