న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)తో కలిసి ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ నూతన సదుపా యాన్ని అందుబాటులోకి తెచ్చి నట్లు తెలిపింది. తమ వినియోగదారులు రూపే నెట్వర్క్ క్రెడిట్ కార్డులను యుపిఐ సేవలకు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొంది. ఇకపై స్కాన్ చేసి కొనుగోళ్లు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోన్నట్లు వెల్లడించింది. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. ఉచితంగా ఈ సేవలను పొందొచ్చని పేర్కొంది.