
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కలవడం జరిగిందని అర్బన్ ఇంచార్జి నీరడిలక్ష్మణ్ తెలిపారు. భవిష్యత్తులో అర్బన్ నియోజకవర్గంలో చేపట్ట కార్యక్రమాల విషయంతో చర్చించడం జరిగిందని, ఆయన సూచన మేరకు జూన్ రెండో వారం నుండి గడపగడపకు బహుజన్ సమాజ్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలని సార్ సూచించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో అర్బన్ నియోజకవర్గాన్ని బీఎస్పీ ఖాతాలో వేయడానికి చేసే కార్యక్రమాలు వివరించగా ప్రవీణ్ సర్ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.ముందుగా అర్బన్ లోని డివిజన్ కమిటీలు, సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలు, మహిళా కమిటీలు, కార్మిక విభాగా కమిటీలు, వేయాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉపాధ్యక్షులు సైకిల్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్, ఆర్ విశాల్, నాయకులు బి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.