పలు కుటుంబ సభ్యులను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు నగరంలో ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. మాజీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగ రెడ్డి తల్లి ఈగ గంగవ్వ పరమపదించడంతో బొర్గంలోని వారి నివాసంలో పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కి చెందిన దర్శన్ సింగ్ తల్లి హర్భజన్ కౌర్ పరమపదించడంతో వారి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సత్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.