ఊరుర మంచినీళ్ల పండగ తాగునీటి విజయాలపై సంబరాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు అన్ని గ్రామాలలో ఆదివారం గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంలో తాగునీటి ట్యాంకుల వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండగ సంబరాలను నిర్వహించుకొని నాడు నేడు తాగునీటి విజయాలపై సభలను ఆయా గ్రామాలలోని సర్పంచ్ల అధ్యక్షతన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు కారోబార్లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.