
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
తాజాగా సిద్దిపేట జిల్లాలో భారీగా ఎస్ఐ లు బదిలీలు అయిన సంగతీ అందరికీ తెలిసిందే. ఐతే సిద్దిపేట జిల్లా నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వి. గంగరాజు దుబ్బాక పోలీస్ ఠాణా కు బదిలీ అయ్యారు. ఐతే దుబ్బాక లో ఎస్ఐగా పని చేస్తున్న బత్తుల మహేందర్ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గా బదిలీ కాగా గురువారం నూతన దుబ్బాక ఎస్ఐ గా వి.గంగరాజు కు బాధ్యతలను బత్తుల మహేందర్ అప్పగించారు. ఈ సందర్భంగా నూతన దుబ్బాక ఎస్ఐగా గంగరాజు పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన దుబ్బాక ఎస్ఐ గా వి.గంగరాజు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కావున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇండ్ల నుండి ప్రజలు బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు,అధికారులు సహకరించాలన్నారు.