నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాధిత గిరిజన మహిళ లక్ష్మిబాయి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 న లక్ష్మిబాయి కూతురు వివాహం జరుగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక నాయకుడు చల్లా లక్ష్మారెడ్డి లక్ష రూపాయలతో పాటు మరికొంత మంది దాతల ప్రోత్సాహంతో రూ.5 లక్షలు అందించి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరగా, రూ.3 లక్షలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు బాధిత మహిళ ఇద్దరు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యనందించాలని మరో లేఖ సబితా ఇంద్రారెడ్డికి రాయనున్నట్టు వీహెచ్ వెల్లడించారు.