పశువులకు గాలికుంటు వ్యాధి కి నివారణ  టీకాలు

నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ఆముదాలపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీక కార్యక్రమం గ్రామ సర్పంచ్ బత్తుల మానస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజన్లలో వచ్చే వ్యాధులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ముందస్తు నివారణ చర్యగా 292 పశువులకు పశువైద్యులు మాధవరావు ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆరిఫ్,అమీర్ ఖాన్ , పశుమిత్ర లు అనూష, భవాని, లావణ్య, గోపాలమిత్రలు శ్రీనివాస్ , మొండయ్య సాయితేజ పాల్గొన్నారు.