
ఇటీవల కురిసిన భారీ వర్షానికి నడ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డిచ్ పల్లి రైల్వేస్టేషన్ ఏరియా ప్రాంతం పరిధిలోని వైకుంఠధామం చుట్టు పూర్తిగా నీరు నిలిచిన విషయంపై గత నెల 30న నవతెలంగాణ లో వచ్చిన వార్తకు ఆధికారులు, ప్రజాప్రతినిధధులు స్పందించారు. ఇక్కడి నుంచి వైకుంఠధామంను తొలగించి, మరోచోట ఏర్పాటు చేయాలని తీర్మాణం చేసినట్లు నడ్పల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కులచారి సతీష్ రావు, కార్యదర్శి కిషన్ రావు లు తెలిపారు. పంచాయతీవారు తీర్మాణం చేసిన కాపీలను ఉన్నతాధికారులకు పంపినట్లు ఎంపీడీవో టీవీఎస్ గోపి బాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారి పక్కన స్థలాన్ని చూశామని, అలాగే నడిపల్లి శివారులో మరోచోట కుడా స్థలాన్ని పరిశీలించినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ వైకుంఠ ధామం ను డిఎల్ పిఓ నాగరాజ్, ఎంపిడిఓ గోపి బాబు,ఎపిఓ, పంచాయతీ కార్యదర్శి కిషన్ రావు లు సందర్శించారు.