
మండలంలోని పలు జీపిలలో వజ్రోత్సోవ సంబురాలను బస్వాపూర్, దోస్పల్లి గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించడం జర్గిందని జేపీఎస్ లు గంగాధర్, జాదవ్ మనోహర్ తెలిపారు. ఈ సంధర్భంగా బస్వాపూర్ సర్పంచ్ రవిపటేల్, దోస్పల్లి సర్పంచ్ సునితా పటేల్ మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కోటిమెుక్కలు నాటాలని సంకల్పించారని, మద్దతుగా కోటి మెుక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాల్గోని ముఖ్యమంత్రి కోరికను నెరవేర్చాలని ఉద్దేశంతో ఖాళీగా ఉన్న ప్రభూత్వ స్థలాలలో మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడివో నరేష్, ఈజీఎస్ ఇంచార్జీ ఏపీవో స్వామీదాస్, సర్పంచులు, ఉప సర్పంచులు, జేపీఎస్ లు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు దోస్పల్లి జీపీ సిబ్బంది లక్ష్మన్, హన్మంత్ తదితరులు పాల్గోన్నారు.