కథలు – కథకులు
రచన: ముక్తవరం పార్థసారధి
పేజీలు: 138, వెల : 80/-
ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర,
నవోదయ పుస్తక కేంద్రాలు.
ముక్తవరం పార్థసారధి, 411,
ప్రభాకర్ అపార్ట్‌మెంట్, హైదరాబాద్ – 500057.
సెల్: 9177618708
ప్రపంచ కథా సాహిత్యంలో గొప్ప కథకులైన పదిమంది రాసిన కథల్ని ఎంపిక చేసుకుని ఆయా కథలు తెలుగులో అనువాదం చేసి విపుల, ప్రస్థానం, ప్రజాసాహితి పత్రికల్లో ప్రచురణై ప్రజాదరణ పొందాయి. జాక్ లండన్ 1898 నుండి 1900 సంవత్సరాల మధ్య 15 రచనలు అచ్చయ్యాయి. నెలకు 30 డాలర్లకు జనపనార మిల్లులో పనికి కుదిరాడు జాక్ లండన్. ఉక్కుపాదం నవల విశ్వవిఖ్యాతం. జాన్ లండన్ ఓ అలస్కా కథ ‘లవ్ ఆఫ్’ లెనిన్‌కు బాగా ఇష్టం. ‘తెల్లవాళ్లూ – ఎర్ర వాళ్లూ’ ఒక ముసలి రెడ్ ఇండియన్ ఇంబర్‌పై న్యాయ విచారణ అంశం ఈ కథాంశం. ఈ కథలో జమ్మీ, ఎలిమి, జడ్జి, పోలీసు, కెప్టెనూ, హుకాన్ (అనువాదకుడు) పాత్రలొస్తాయి. స్థానిక ఆదివాసీ రెడ్ ఇండియన్ ప్రాంతాల్ని తెల్లవాళ్లు వలసలుగా వచ్చి ఆక్రమించి, ఆస్తుల్ని, ఆడవాళ్లని కొల్లగొట్టిన తీరు ఇంబర్ ఫ్లాష్‌బ్యాక్ కథగా చెపుతాడు. జడ్జి శిక్ష అమలు చేసే దశగా ఆలోచనలో వుండడం, ఇంబర్ కళ్లు మూయడంతో కథ ముగుస్తుంది. ఒక తెగ కన్నా బలమైన మరో తెగ, ఒకజాతి కన్నా బలమైన మరో జాతి కొత్త న్యాయ వ్యవస్థల్నీ శిక్షా స్మృతుల్నీ సృష్టిస్తూనే వుంటాయి అనే వాక్యాలతో ఈ కథ ముగుస్తుంది (పేజీ 21).
మబ్బు తునక కథ ఇద్దరు స్నేహితుల మధ్య నడుస్తుంది. గలహర్, ఛాండ్లర్, తరువాత కాలంలో ఛాండ్లర్ పెళ్లిచేసుకోవడం, కుమారుని కనడం, భార్యతో ఘర్షణ, సంసార బాధలు, బాధ్యతలు, 8 పేజీల్లో చెప్పిన వాస్తవిక కథ, జేమ్స్ జామస్ రచన, యునిసెస్ గుర్తుకు వస్తుంది (పేజీ 36).
రచయితల కలాలకున్న ‘పాఠకుల అభిరుచి’ అనే సంకెళ్లు తెంచటానికే నా జీవితం అంకితం చేస్తాను’ అన్న సింక్లెయిర్ మ్యానిఫెస్టో చదవాలి (పేజీ128). పాఠకుల్ని, సాధారణ ప్రజల్ని ఆలోచింపజేయడమే కాక కార్యోన్ముఖుల్ని చేసే ‘మన సాహిత్యం’ (పేజీ 131) వ్యాసం చాలా విలువైనది.
సాదల్ హసన్ మంటో ‘కూతురు’ – ఆర్ధర్ మిల్లర్ ‘జీవహింస’, మార్క్ ట్వీన్ ‘అద్దంలో బొమ్మ’ కథలు చాలా సందేశాత్మకమైనవి. ఆలోచన, అవగాహన అందించే రచనలు. నవరత్నాలు లాంటి 9 కథలూ మానవ జీవితాలకు అద్దం పడతాయి. అనేక పాశ్చాత్యకవులు, రచయితల్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ముక్తవరం పార్థసారధి అభినందనీయులు.
విలువైన కథలు – కథకులు
9:55 pm