ఘనంగా  శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని గోవిందరాజస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతం ఆచరించారు. ప్రధాన అర్చకులు ఆలయానికి వచ్చిన మహిళలతో కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వ్రతం అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటిల్లిపాది పిల్లాపాపలతో ధనం ధాన్యం పశుసంపదలతో దీర్ఘ సుమంగళ ఉండాలని పూజారులు ఆశీర్వాదం అందించారు.