కందకుర్తి కేశవ శిశు మందిర్ లో మహిళలతో వరలక్ష్మి వ్రతం..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి కేశవ శిశు మందిరంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి మాతాకు పిండి వంటలతో పాటు పండ్లు, సమర్పించి తమ కోరికలను తీర్చుకున్నారు. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంటుందని వారు పేర్కొన్నారు.