
వీర్నపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిటి కార్యవర్గం ఏర్పాటు చేసి జీవో జారీ చేసిన తేదీ నుండి రెండు సంవత్సరాలు పదవి బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు . వీర్నపల్లి బి అర్ ఎస్ పార్టి మండల అధ్యక్షులను వీర్నపల్లి నూతన మార్కేట్ కమిటి చైర్మన్ గా గుజ్జులా రాజిరెడ్డి, భూక్య తండ గ్రామానికీ చెందిన వైస్ చైర్మన్ గా భూక్య తులసి రాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఆకుల సత్యం వన్ పల్లి, పెంట దేవ రాజూ గర్జన పల్లి, భూక్య దర్శింగ్ జవహర్ లాల్ తండ, భూక్య రాజు లాల్ సింగ్ తండ, పొన్నం దేవ రాజు రంగం పేట, కడువ లచ్చయ్య మద్ది మల్ల, గంగ దరి రాజు వీర్నపల్లి , లోకుర్తి లక్ష్మి వీర్నపల్లి , గుగులోతు రమేష్ బావు సింగ్ నాయక్ తండ, బండి మహేందర్ కంచర్ల, బండ సుదర్శన్, డప్పుల లింగం లను వీర్నపల్లి నూతన కార్యవర్గం కమిటీ గా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. నూతన కార్యవర్గం త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు…