– మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. నెల వారీగా కూరగాయల వినియోగం, సాగు, ఉత్పత్తి, సన్న, చిన్నకారు రైతులపై మరోసారి అధ్య యనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కూరగా యల విత్తనాల ధరలు, మార్కెట్‌లో కూరగాయల ధరలు, రైతులకు అవసరమైన సౌకర్యాలు తదితరాంశా లపై పరిశీలించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ‘కూరగాయల సాగు’పై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి సత్య శారద, జాతీయ విత్తన సంస్థ ప్రాంతీయ అధికారి బ్రిట్టో తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నూతన జిల్లా కేంద్రాల్లో కూరగాయల సాగును పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై సూచనలు చేయాలన్నారు. కూరగాయల సాగులో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆచరణాత్మక విధానాలను పరిశీలించాలని కోరారు.