ఫలక్‌ నూమ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
ఫలక్‌ నూమ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు కమల్‌ కుమార్‌, ఎస్‌ఐ మోజిరామ్‌ నాయక్‌ నేతత్వంలో యాకత్‌ పురా నియోజకవర్గం సంతోష్‌ నగర్‌, చంద్రాయన గుట్ట నియోజకవర్గం కంచన్‌ బాగ్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేసి..నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లు, పోలీస్‌, ప్రెస్‌ సిక్కర్లను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వాహనాల నెంబర్లను ఏమాత్రం సరిగా లేకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ ఎండీ మహమూద్‌, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.