మెట్రో వద్ద నిలిపిన వాహనాలే టార్గెట్…

నవతెలంగాణ-హాయత్ నగర్
యల్ బి నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయానికులు నిలిపిన వాహనాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని యల్ బి నగర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం యల్ బి నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్న బలం రాజేష్. సరూర్ నగర్ మంద మల్లమ్మ వద్ద నివాసం ఉంటున్న సయ్యద్ ఖాజా లు కలిసి జల్సాలకు అలవాటు పడి కేవలం మెట్రో వద్ద నిలిపి ఉంచిన ద్వీ చక్ర వాహనాలను చోరీ చేసేవారు. వారి వద్ద నుండి 8 ద్వీచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. యల్బి నగర్ లో 3 కేసులు, మీర్ పేట లో 2కేసులు, చైతన్య పురి, సరూర్ నగర్,ఉప్పల్ పోలీస్ స్టేషన్ లలో కేసులను ఛేదించారు.మొత్తం వాటి విలువ3లక్షల రూపాయలు వుంటుందని తెలిపారు. తదనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి నగదు అందజేశారు. ఆమె వెంట యల్ బి నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, యల్ బి నగర్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి,క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు, క్రైమ్ ఎస్ ఐ లు నరేందర్,సురేందర్,సిబ్బంది జంగయ్య,పృథ్వి,యాదగిరి తదితరులు వున్నారు.