వాహనాలకు ఈ నెల మూడో తేదీన వేలం పాట

నవతెలంగాణ -కంటేశ్వర్
నిజాంబాద్ ఆబ్కారి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో దొరికిన వాహనాలకు ఈనెల మూడో తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దిలీప్ బుధవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కేసులలో దొరికిన రెండు ఆటోలు ఎనిమిది ద్విచక్ర వాహనాలు ఎక్సెస్ పోలీస్ స్టేషన్ నందు ఉన్నాయని తెలిపారు. కావున వాహనాల వేలం పాటలో పాల్గొనేవారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ బోర్గాం పాంగ్ర వద్ద సంప్రదించగలరని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నిజామాబాద్ దిలీప్ తెలియజేశారు.