లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వేణి ప్రసన్న

అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు
నవతెలంగాణ- కంటేశ్వర్:
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒకరు ఏసీబీకి చిక్కారు. ఐ అండ్ పీఆర్ శాఖలో పని చేసిన విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ కు సంబంధించి రావాల్సిన బెనిఫిట్ కోసం లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ నూతన కలెక్టరేట్ లోని ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వేణి ప్రసన్న అనే అధికారిని తొమ్మిది వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఐ అండ్ పీఆర్ శాఖలో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి చనిపోవడంతో అతని కుటుంబానికి రావాల్సిన గ్రాడ్యుటీ జీపీఎఫ్, ఇతర అలవెన్స్ ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వేణి ప్రసన్న తొమ్మిది వేలు లంచం ఇస్తే సంబంధిత నిధుల విడుదలకు ఓకే చేస్తానని చెప్పడంతో బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు. బాధిత కుటుంబం నుంచి తొమ్మిది వేల తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలోని ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీనివాసులు ఈ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న వేణి ప్రసన్నను పట్టుకొని కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒకరు ఏసీబీకి చిక్కారు. ఐ అండ్ పీఆర్ శాఖలో పని చేసిన విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ కు సంబంధించి రావాల్సిన బెనిఫిట్ కోసం లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గురువారం నిజామాబాద్ నూతన కలెక్టరేట్ లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వేణి ప్రసన్న అనే అధికారిని తొమ్మిది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఐ అండ్ పీఆర్ శాఖలో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి చనిపోవడంతో అతని కుటుంబానికి రావాల్సిన గ్రాడ్యుటీ జీపీఎఫ్, ఇతర అలవెన్స్ ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వేణి ప్రసన్న తొమ్మిది వేలు లంచం ఇస్తే సంబంధిత నిధుల విడుదలకు ఓకే చేస్తానని చెప్పడంతో బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు. బాధిత కుటుంబం నుంచి తొమ్మిది తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలోని ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీనివాసులు ఈ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న వేణి ప్రసన్నను పట్టుకొని కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.