– గిరిజన మహిళను వివస్త్ర చేసి…
– నడిరోడ్డుపై కొట్టిన కేసులో
బీజేపీ ఎమ్మెల్యే భార్య, ముగ్గురిపై కేసు
ముంబయి : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అంతులేని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో గిరిజన మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి కొట్టారు. ఈ వీడియో వైరల్ కావటంతో.. బీజేపీ ఎమ్మెల్యే భార్య సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ గిరిజన మహిళ రోడ్డుపై బట్టలు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆదివారం (అక్టోబర్ 15) తనపై బీజేపీ ఎమ్మెల్యే సురేష్ దాస్ భార్య ప్రజక్తా సురేశ్ దాస్ వ్యక్తులు దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది.
బీజేపీ ఎమ్మెల్యే భార్య తన అనుచరుల సహాయంతో తన పూర్వీకుల భూమిని లాక్కోవాలనుకుంటోందని మహిళ ఆరోపించింది. సుమారు 70 ఏండ్లుగా ఉన్న తమ భూమిని గుంజుకోవాలని చూస్తున్నారంటూ.. ఆమె తెలిపారు.అయితే తన భార్యపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే సురేష్ దాస్ తోసిపుచ్చారు. అదంతా అబద్ధమని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ దాస్ భార్య ప్రజక్తా సురేశ్ దాస్, రాహుల్ జగ్దాలే, రఘు పవార్‌లపై ఐపీసీ సెక్షన్ 354, 354 బీ, 323, 504, 506, 354 ఏ, 34, షెడ్యూల్డ్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ కింద కేసు నమోదు చేశారు.