న్యాయం కోసం బాధితురాలి ధర్నా..

Victim dharna for justice..నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మరో యువతితో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నాడని ఆరో పిస్తూ ప్రయుడి ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగిన సంఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి పెద్దకుంటపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితులురాలు తెలిపిన వివరాల ప్రకారం భూపాల పల్లి మున్సిపల్‌ పరిధి 11వ వార్డు పెద్దకుంటపల్లికి చెందిన భూక్య దేవ్‌సింగ్‌ కమల దంపతుల కుమా రుడు భూక్య జంపన్న, అదే పెద్దకుంటపల్లికి చెందిన కృష్ణవేణి రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని జంపన్న నమ్మబలికి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండా జంపన్న వేరే యువతితో ఎంగేజ్మెంట్‌ చేసుకోగా కృష్ణవేణి ప్రశ్నించగా నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురి చేశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని జంపన్న ఇంటికి వెళ్లగా జంపన్న, అతని కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా కొట్టి హత్య చేయాలని ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది. దీంతో చేసేదేమి లేక స్థానిక భూపాలపల్లి పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జంపన్న ప్రేమించలేదని దాటవేస్తున్నాడని, సంబంధిత ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపింది. ఏమి చేయాలో తెలియక భూక్య జంపన్న ఇంటిముందు న్యాయ పోరాటం చేస్తున్నానని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని బాధితురాలు కృష్ణవేణి పేర్కొంది. ఆమె పోరాటానికి మహిళ సంఘాలు సైతం మద్దతు తెలిపాయి.