వరంగల్‌ పశ్చిమలో గెలుపు నాదే : జంగా

నవతెలంగాణ-హన్మకొండ
రాబోయే ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజ కవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపు నాదేనని మాజీ డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు. హనుమకొండ హంటర్‌ రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో పశ్చిమ ని యోజకవర్గ అనుచరులు, కార్యకర్తలతో జంగారా ఘ వరెడ్డి శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడు తూ బీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడుపోయిన నాయ కుడికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రె స్‌కు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నాకు ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచేసత్తాఉందని, కాం గ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికైనా ఆలోచించి టికెట్‌ కేటా యిస్తే తప్పకుండా గెలిచి చూపిస్తానన్నారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వకుంటే ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌పార్టీ నుంచి పోటీలో ఉంటానని జంగా రాఘవ రెడ్డి స్పష్టం చేశారు. తనను ఆద రించి పశ్చిమ నియో జకవర్గ ప్ర జలు గెలిపిస్తే తన సొంత నిధులు రూ.50 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానన్నారు. ప్రతి డివిజన్‌లో కమ్యూనిటీ హాల్‌ కట్టి స్తానని హామీ ఇచ్చారు. నియో జకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ టౌన్‌ ప్రెసి డెంట్‌ కట్ల శ్రీనివాస్‌, కార్పొరే టర్లు, మాజీకార్పొరేటర్లు జం గా అభిమానులు, నాయ కులు మహిళలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.