నవ తెలంగాణ- ఆర్మూర్: పట్టణంలోని విజయ్ హై స్కూల్ 42వ టాలెంట్ షో శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్టు విజయ్ విద్యాసంస్థల అభినేత్రి డాక్టర్ అమృత లత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి రాజా శ్రీ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలోని అంకాపూర్ గ్రామ లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు గడ్డం రాజారెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.