రిలయన్స్‌ షాపుల్లో విజయలక్ష్మి డీర్‌ బ్రాండ్‌ పప్పులు

At Reliance Shops Vijayalakshmi Deer Brand Pulses– తెలుగురాష్ట్రాల్లోని అవుట్‌లెట్లల్లో విక్రయాలు
హైదరాబాద్‌: విజయలక్ష్మి డీర్‌ బ్రాండ్‌ పప్పులు ఇప్పుడు తెలంగాణ, ఏపీలోని రిలయన్స్‌ స్మార్ట్‌ పాయింట్‌, రిలయన్స్‌ స్మార్ట్‌ బజార్లలో విక్రయించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, పుట్నాల పప్పు, ఇడ్లీ రవ్వ కస్టమర్ల సౌలభ్యం, వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది. మా అనుభవం, నాణ్యత పట్ల నిబద్ధతతో, ఆరోగ్యం,రుచి రెండింటిని ఆనందిస్తారని తెలిపింది. విజయలక్ష్మి డీర్‌ బ్రాండ్‌కు ,దాల్‌ పరిశ్రమలో 33 ఏండ్ల అనుభవం ఉన్నదని, కస్టమర్లకు పొలాల నుంచి ప్లేట్‌ వరకూ పోషకాహారం అధికంగా ఉండే మంచి నాణ్యత గల పప్పులను అందిస్తున్నట్టు పేర్కొన్నది.