ఎంపీ రంజిత్‌ రెడ్డి కషితో వికారాబాద్‌ రైల్వే బ్రిడ్జి మంజూరు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రత్యేక కషి కారణంగా వికారాబాద్‌ కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం మంజూరు చేసింది. ఆ నిధుల మంజూరుకు సంబంధించిన జీవో కాపీలను ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి స్వయంగా సీఎం కేసీఆర్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అందజేశారు. తమ ప్రాంత ప్రజలకు సంబంధించిన నాలుగు దశాబ్దాల కల నెరవేర్చినందుకు కేసీఆర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డికి ఆనంద్‌ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం లబిస్త్తోందని ఎంపీ రంజిత్‌రెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.