రా రమ్మని పిలిచెను మామ
అందానికి అందం చందమామ
అవని తోబుట్టు మన మేన మామ
నీ కళలే మేము చెప్పుకున్న కథలు
ఇక చెప్పాలి మామ నీ సరికొత్త కథలు
ఆ మింటిలోనే నీవు వుంటావంట
పండు వెన్నెల లే కురిపిస్తావు ఇంటింటా
40 రోజుల మండల దీక్ష వలయం
పూర్తి చేసిన విక్రమ్ ల్యాండర్
సురక్షితంగా దిగడం మాకు వండర్
చుక్కల మధ్యన నీ నవ్వుల దరహాసం
ఇక మువ్వన్నెల చంద్రహాసం
జాబిల్లిపై జాతీయ చిహ్నాల సింహ గర్జన
అందని ద్రాక్ష అందించిన అందరి దీక్ష
రాత్రి రాయబారాలు నడుపువాడు
చల్లని, చిమ్మ చీకట్ల బిలాల నిగూఢాలు
గుట్టు చెబుదామని
రా రమ్మని పిలిచెను నేడు
వచ్చిపోతేనే చుట్టరికం అన్నాడు
మన బంధం మేనమామ బంధం
యుగయుగాలజి
దశ్యాదశ్య చక్రియ ప్రక్రియ బంధం
భూమికి వలయ రక్షకుడైన వాడు
పిలిచెను’ స్వాగతం బడ్డీ ‘అని
సంకల్పం సాకారం చేసుకొమ్మని
రా రమ్మని పిలిచెను రే రాజు
విశ్వానికి లివిక్రమ్ విక్రమార్కు డేలి
(చంద్రయాన్- 3 విజయవంతమైన సందర్భంగా)
– పి.బక్కారెడ్డి, 9705315250