కుక్కల బెడదతో గ్రామ పంచాయతీకి తాళం

నవతెలంగాణ-భిక్కనూర్: వీధి కుక్కల బెడదతో గ్రామపంచాయతీకి తాళం వేసి విధులు నిర్వహించుకోవలసిన పరిస్థితి మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో నెలకొంది. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గ్రామంలో తమ పనులు చేసుకోవాలన్న, గ్రామం నుండి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాలనుకున్న గ్రామ పంచాయితీకి తాళం వేసి వెళ్లాల్సివస్తుంది. గ్రామపంచాయతీని తెరచి ఉంచి గ్రామంలో పనులు నిర్వహిస్తే ఎవరు లెని సమయంలో గ్రామపంచాయతీ లోపలికి కుక్కలు వెళుతున్నాయని, కుక్కల బెడద కారణంగా ఎక్కడికి వెళ్లాలన్నా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి వెళ్లాల్సి వస్తుందని కార్యదర్శి సౌజన్య తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఎప్పుడూ ఒకరిని ఉంచడం లేదా కార్యలయంలోకి కుక్కల రాకుండా చర్యలు తీసుకోవడం మాని గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.