గద్దర్ కు నివాళులర్పిస్తున్న బేతిగల్ గ్రామస్తులు

– బేతిగల్ గ్రామంలో గద్దర్ సంస్మరణ సభ
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని బేతిగల్ గ్రామంలో ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ సంస్మరణ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గద్దర్ చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోరె స్వామి, గ్రామస్తులు సారయ్య, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.