ఈగ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బాజిరెడ్డికి మద్దతు తెలుపుతున్న బోర్గాం (పి) గ్రామస్తులు

నవతెలంగాణ- మోపాల్: సోమవారం రోజున మోపాల్ మండలం బోర్గం(పీ) గ్రామానికి చెందిన మైనార్టీ లు, శాస్త్రి నగర్ కాలనీ వాసులు, ఎస్ సి కుల సంఘాలు నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎం ఎల్ ఏ బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతు తెలుపుతూ, బాజిరెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించు కుంటామని అన్నారని గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి ని మైనార్టీలు, శాస్త్రి నగర్ కాలనీ వాసులు, ఎస్ కాలనీ వాసులు ఘనముగా సన్మానించారు. నూడా చైర్మన్ మాట్లాడుతూ మైనార్టీ లకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తూ అన్ని పథకాలు వారికి అందేటట్లు ఎం ఎల్ ఏ కృషి చేసారని అన్నారు. అలాగే శాస్త్రి నగర్ కాలనీ వాసులకు ఏ సమస్య తన దృష్టి కి తీసుకరావాలని సూచించారు. ఎస్ సి కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే దళిత బందు, గృహ లక్ష్మి, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో పేద వారికీ అండగా ఉందని మళ్ళీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకొందామని ఆయనను భారీ మెజారిటీ తో గెలిపించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు బాబూమియ్య, రషీద్, శ్రీనివాసరెడ్డి, హాన్మాండ్లు, దర్శన్, కిరణ్ గౌడ్, ప్రవీణ్, వినయ్, ఈగ లింగారెడ్డి, చిట్టీ పండరి, యాదయ్య, మినయ్య, భూషణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.