వనభోజనాలకు వెళ్లిన పెద్దపల్లి గ్రామస్తులు

నవతెలంగాణ- రాజంపేట్
గత 20 రోజులుగా వర్షాలు పడకపోవడంతో రైతులు వేసిన మొక్కజొన్న, పత్తి ఎండలకు పూర్తిగా వాడుచూపుతున్నాయి. దీనితో గ్రామస్తులంతా కలుపుకొని ఆదివారం గ్రామ శివారులో వన భోజనానికి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో సమృద్ధిగా వర్షం పడాలని పంటలు బాగా పండి అందరు బాగుండాలని వారు దేవుని వేడుకున్నారు.